నేటి సాక్షి 20 జూలై పాములపాడు:-
పాములపాడు మండల తాహసిల్దార్ కార్యాలయం చుట్టూ మెప్మా,జూనియర్ కాలేజ్, హౌసింగ్ తదితర మండల కార్యాలయాలు ఉన్నాయని ప్రజలు, అధికారులు నిత్యం ఈ రోడ్డు వెంటే తిరుగుతున్నారని అలాంటి రోడ్డును అధికారులు మరవడం తగదని తక్షణమే తహసిల్దార్ కార్యాలయానికి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రోడ్ల నిర్మాణంలో అరసత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ అధికారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాణాకచర్ల గుండాలనట్టు లో ఉన్న కాలనీ కి బోర్ వేసి త్రాగునీరు అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు డిమాండ్ చేశారు..సోమవారం పిజీఆర్ఎస్ లో అధికారులకు రోడ్ల మరమ్మత్ ల పై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాములపాడు మండలం లో ప్రధాన ప్రజానీకం తిరిగే తాసిల్దార్ కార్యాలయానికి రోడ్డు వేయలేని పరిస్థితి ఉందంటే మిగతా ప్రాంతాల్లో పిఆర్ అధికారుల పర్యవేక్షణ ఏమాత్రం ఉందో అర్థం అవుతుంది అన్నారు ప్రజలు అధికారులు రద్దీగా తిరిగే హౌసింగ్ మెప్మా,జూనియర్ కాలేజ్ రోడ్డు మట్టి రోడ్డు కావడం వల్ల వర్షం వస్తే బురద మాయం తో యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉందన్నారు.అలాగే మండల కేంద్రానికి ఇస్కాల, చెలిమిళ్ల ప్రజలు రావాలంటే నరకయాతన అనుభవిస్తున్నారని అనారోగ్యబారిన పడిన వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరం అన్నారు. భవనశి బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.లేని పక్షం లో ఆందోళన నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమం లో సీపీఐ మండల కార్యదర్శి సుధాకర్,నాయకులు సామెల్, షేక్షవలి తదితరులు పాల్గొన్నారు.
Andhra
*తాహసిల్దార్ కార్యాలయానికి సిసి రోడ్డు వేయండి.బవణాసి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి..రోడ్లు వేయించడంలో పంచాయతీరాజ్ ఏఈ విఫలం*.*ఎం.రమేష్ బాబు,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు*
Quick Summary:
విఫలం*.*ఎం.రమేష్ బాబు,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు*