నేటిసాక్షి, నల్లగొండ :
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవనంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో "ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం మరియు సంబంధిత అంశాలపై" నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ
సమావేశానికి ఇరిగేషన్,పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎల్-నినో ప్రభావం వల్ల ఏర్పడే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అనువైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, సాగునీటి నిర్వహణను పటిష్టం చేయాలని, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని, వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని మంత్రులు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో
నకిరేకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Telangana
ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి : మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Quick Summary:
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి
