నేటి సాక్షి ధర్మపురి తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన కల్పించాలి..
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి .
ఎల్‌నియో ప్రభావంపై నల్గొండ జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
నల్గొండ:
తక్కువ నీటితో సాగు అయ్యే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా ఇన్ చార్జీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎల్ నియో ప్రభావంపై ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, తాగునీరు, సాగునీటి నిర్వహణతో పాటు ఇతర సంబంధిత అంశాలపై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇంచార్జ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మూడు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, పశుసంవర్ధక తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎల్‌నియో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, సాగునీటి నిర్వహణ, తాగునీటి సరఫరా, పశుగ్రాసం వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని, మూడు జిల్లాల అధికారులు పరస్పర సమన్వయంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
Telangana
నేటి సాక్షి ధర్మపురి తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన కల్పించాలి..
Quick Summary:
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి .
