నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పంట పొలాలను పరిశీలించి రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాట్లతో పచ్చగా కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు సాగునీటి కొరత కారణంగా బీడు భూములుగా మారే పరిస్థితి నెలకొనడం అత్యంత బాధాకరమని అన్నారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండదని పర్యావరణ, వాతావరణ శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఎలాంటి ముందస్తు ప్రణాళికలు రూపొందించలేదని విమర్శించారు. ఇప్పటి వరకు నారు పోసిన రైతులకు సాగునీరు వస్తుందా లేదా అనే విషయంపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వటంలో అలసత్వం వ్యవహరిస్తుంది
భూగర్భ జలాలు కూడా గణనీయంగా తగ్గిపోవడంతో బోర్లలో నీరు రాకపోవడంతో రైతులు తమ వద్ద ఉన్న పరిమిత నీటితో ఒకటి లేదా రెండు ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు
రైతులు వ్యవసాయం చేయలేకపోతే, వ్యవసాయ కూలీలకు కూడా పని దొరకదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది వ్యవసాయ కూలీలు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు.
పంటలు బాగా పండితే అది తమ ఘనతగా చెప్పుకునే ప్రభుత్వం, కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎందుకు అలసత్వం వహిస్తుంది అని అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా వ్యవసాయంపై, రైతులపై ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే శాస్త్రీయంగా పరిస్థితులను అంచనా వేసి సాగునీటి లభ్యతపై రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, కరువు నివారణ చర్యలను అత్యవసరంగా ప్రారంభించాలని, రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జానకి రామాచారి తాళ్లూరు శ్రీనివాస్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ అలసగాని జనార్ధన్ ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య మేకపోతుల శ్రీను అంబాల వెంకటి మాధవరపు శ్రీనివాస్ నర్సయ్య షేక్ షాకీర్ బాషా అమర్ గాని లింగరాజు తదితరులు పాల్గొన్నారు..
Telangana
*రైతులకు నీళ్లు కరువు రైతు కూలీలకు పని కరువు*
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పంట
