నేటిసాక్షి కుత్బుల్లాపూర్
"ప్రతిరోజు ఒక వార్డ్" కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి సృజన ఐఏఎస్ కొంపల్లి డివిజన్‌లోని ఎన్‌సీఎల్ కాలనీ మరియు నోబుల్ ఎన్‌క్లేవ్ ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమైన కమిషనర్ పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర పౌర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్‌సీఎల్ కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో పాటు కాలనీలో నెలకొన్న ఇతర మౌలిక వసతుల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా కొంపల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని కొంపల్లి మాజీ సర్పంచ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జెమ్మి దేవేందర్ కమిషనర్ సృజన ఐఏఎస్కు అందజేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన కమిషనర్ సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బైరీ ప్రశాంత్ గౌడ్, కొంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిరెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ లేబర్ సెల్ అధ్యక్షుడు కందాడి సుదర్శన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ లేబర్ సెల్ అధ్యక్షుడు కావలి గోపాల్ ముదిరాజ్, అంజి ముదిరాజ్, షేక్ ఇబ్రహీం, ఖదీర్, కావలి నవీన్ ముదిరాజ్, ఎన్‌సీఎల్ మరియు నోబుల్ ఎన్‌క్లేవ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సారికా రెడ్డి, శశిధర్, నాగరాజ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Telangana
ప్రతిరోజు ఒక వార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఐఏఎస్
Quick Summary:
"ప్రతిరోజు ఒక వార్డ్" కార్యక్రమంలో