నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గుడిసె రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తీసుకున్న కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలలో (హట్ సర్వే)ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ముక్కపాటినరసింహారావు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 11 గ్రామాలలో 97 మంది గుడిసెలలో నివసిస్తున్నట్లు పై అధికారుల నుండి వచ్చిన జాబితా ప్రకారం ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నామని మండల అభివృద్ధి అధికారి ముక్కపాటి నరసింహారావు అన్నారు. ఇందులో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలో 53 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు.
మిగిలిన వారు వివిధ కారణాలవల్ల వారిని రిజెక్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ స్వర్ణ, గ్రామ పంచాయితీ కార్యదర్శి షరుపుద్దిన్, సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
*గుడిసెలలో నివసిస్తున్న వారి వివరాలు సేకరణ* 👉 ఎంపీడీవో ముక్కపాటి నరసింహారావు..
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం