*నేటిసాక్షి హైదరాబాద్*
తెలంగాణ రాష్ట్ర భట్రాజ్ సంఘం (2026–2029) నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ లోని ఇంజాపూర్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర భట్రాజ సంఘ భవనంలో నిర్వహించారు.
మహిళా కమిటీలో ప్రతికంఠం హేమలత ప్యానల్, వెంకటలక్ష్మి ప్యానల్ మధ్య జరిగిన పోటీలో ప్రతికంఠం హేమలత ప్యానల్ ఘన విజయం సాధించినట్లు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ప్రకటించింది. కేంద్ర కమిటి ప్రధాన ఎన్నికల అధికారి చక్రహరి విద్యాధర్ భట్, ప్రధాన ఎన్నికల అధికారి తోకచిచ్చు పుల్లమరాజు ఫలితాలను వెల్లడించారు.
కేంద్ర కమిటి పరిశీలకులు కేసిపెద్ది నరసింహరాజు, ఎన్నికల అధికారులుగా కూరపాటి కరుణాకర్ రాజు, కాసు విశ్యోదర్ రాజు పర్యవేక్షణ అధికారులుగా కూరపాటి రంగరాజు, కూరపాటి సుశీల, ఎన్నికల నిర్వహణలో ముఖ్య సహాయకులుగా సరికొండ నరసరాజు, బొల్లేపల్లి మనోహర్ రాజు, కాసు మహేశ్వర్ రాజు, బి ఎస్ ఎన్ ఎల్ ప్రసాద్ రాజు, కూరపాటి శ్యామ్మోహన్ రాజు, బిరుదురాజు రాజేందర్ రాజు, బిరుదురాజు చంద్రమోహన్ రాజు, సత్యనారాయణ రాజు, బిరుదురాజు సతీష్ రాజు, దేవరాజు నాగఫణిందర్ రాజు, దేవరాజు సంపత్ రాజు, దేవరాజు సత్యాకర్ రాజు తదితరులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. మహిళా కమిటీ అధ్యక్షురాలిగా ప్రతికంఠం హేమలత, ప్రధాన కార్యదర్శిగా ప్రతికంఠం సావిత్రి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా చెన్నమాధవుని కిరణ్ మృదుల, కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా తోకచిచ్చు పద్మ, అసోసియేట్ అధ్యక్షులుగా బొల్లెపల్లి గీత, చెన్నమాధవుని పద్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్నపురాజు పద్మ, సాంస్కృతిక కార్యదర్శిగా రాళ్లబండి అరుణ, క్రీడా కార్యదర్శిగా అపోజ్వాల మాధవి, ప్రచార కార్యదర్శిగా తంగేళ్ల సుజాత ఎన్నికయ్యారు. యువజన సంఘం ఎన్నికల్లో ప్రతికంఠం చంద్రశేఖర్ రాజు అధిక మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, సరికొండ సుధీర్ రాజు ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులుగా దేవరాజు హర్షవర్ధన్ రాజు, బొల్లెపల్లి సాయి కన్నా, ఉపాధ్యక్షుడిగా బొల్లెపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శిగా రాళ్లబండి సాయికుమార్ రాజు, క్రీడా కార్యదర్శిగా బట్టు ప్రేమ్ సాయి రాజు, సాంస్కృతిక కార్యదర్శిగా ప్రతాప్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా దురద రాజు, నిఖిల్ రాజు, కార్యదర్శిగా ఈలపాటి సునీల్ కుమార్ రాజు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన మహిళా, యువజన కార్యవర్గ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర భట్రాజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరాజు విష్ణువర్ధన్ రాజు, ప్రధాన కార్యదర్శి ప్రతికంఠం పూర్ణచందర్ రాజు సమక్షంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చక్రహరి విద్యాధర్ భట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రతికంఠం హేమలత మాట్లాడుతూ, సంఘ పెద్దల సూచనలు, సలహాలతో రాబోయే మూడు సంవత్సరాల పాటు సంఘ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తామని, భట్రాజ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. తమపై విశ్వాసం ఉంచి గెలిపించిన భట్రాజ కుల బంధువులందరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Telangana
*రాష్ట్ర భట్రాజ సంఘం మహిళా, యువజన కమిటీల నూతన కార్యవర్గం* -* హేమలత మహిళా అధ్యక్షురాలు – చంద్రశేఖర్ రాజు యువజన అధ్యక్షుడు
Quick Summary:
హేమలత మహిళా అధ్యక్షురాలు – చంద్రశేఖర్ రాజు యువజన అధ్యక్షుడు
