నేటిసాక్షి, మిర్యాలగడ : ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అన్నారు.
మంగళవారం నియోజకవర్గంలోని దామరచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో, మరియు వాడపల్లి గ్రామంలో నిర్వహించిన 'సర్' సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నల్లగొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ కో-ఆర్డినేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు తో సమావేశమై, ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించి, ప్రతి అర్హులైన ఓటరును గుర్తించి, వారి వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. గడువు ముగిసే వరకు నిర్లక్ష్యం చేయకుండా, సాధ్యమైనంత మేరకు జూలై 30లోపే ఓటరు జాబితాలకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని బిఎల్ఏ లకు సూచించారు.
దామరచర్ల, వాడపల్లి గ్రామాల్లో బిఎల్ఏ లు సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను పరిశీలించిన అనంతరం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఆగస్టు 3 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిఎల్ఏ లు గ్రామాలు, పట్టణాలను విడిచిపెట్టకుండా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల హక్కులను పరిరక్షించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలమని, ప్రజల ఆశీర్వాదంతో 2029లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ సర్ ఇన్‌చార్జ్ షబ్బీర్ ఆలీ, మండల అధ్యక్షుడు గాజుల శ్రీను, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్, డిసిసి కార్యదర్శి పగిళ్ల రాజు, పోకల కిరణ్ పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
'సర్' కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి -డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత
Quick Summary:
నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని