Telangana
బుగ్గారం మండలం ఎంపిడివో కార్యాలయం లోముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Quick Summary:
అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బుగ్గారం (నేటి సాక్షి) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం ఎంపిడివో కార్యాలయంలో మంగళవారం రోజున నిర్వహించిన ముఖ్య ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొని అర్హులైన 44 మంది లబ్దిదారులకు 15,98,500 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు అత్యవసర సమయంలో అండగా నిలిచే గొప్ప సంక్షేమ పథకం అన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో బుగ్గారం గ్రామ సర్పంచ్ శ్రీమతి నక్క రాజవ్వ రాజయ్య, ఉప సర్పంచ్ శ్రీమతి జంగా లావణ్య శ్రీనివాస్, వార్డు సభ్యులు,బుగ్గారం మండల గ్రామాల సర్పంచులు మరియు బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగునూరి నర్సగౌడ్, ఎంపివో, ఎం ఆర్ ఓ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు