నేటిసాక్షి దుండిగల్ గండి మైసమ్మ
దుండిగల్ మున్సిపల్ పరిధిలోని డి. పోచంపల్లి గ్రామం, సర్వే నెం.120/3లో ఉన్న శివ సత్యజ్యోతి కాలనీకి చెందిన సుమారు 2,000 గజాల పార్కు/ఓపెన్ స్థలం కబ్జాకు గురవుతోందని 294 డివిజన్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఏఆర్ సాదు యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు ఆమోదిత లేఔట్‌లో లేని కొత్త లేఔట్‌ను సృష్టించి, ప్రజా ఉపయోగం కోసం కేటాయించిన ఓపెన్ స్థలానికి ప్లాట్ నెంబర్లు కేటాయించి విక్రయానికి పెట్టడం పూర్తిగా అక్రమమని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమించడం చట్టవిరుద్ధమని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కబ్జా యత్నాలను అడ్డుకోవాలని కోరారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, కుంటలు, చెరువులు, ఓపెన్ స్థలాలను కబ్జాల నుంచి రక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సాదు యాదవ్ పేర్కొన్నారు.కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, శివ సత్యజ్యోతి కాలనీలోని పార్కు స్థలాన్ని పూర్తిగా రక్షించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను కోరారు.
Telangana
ప్రెస్ నోట్ శివ సత్యజ్యోతి కాలనీ పార్కు స్థలంపై కబ్జా యత్నం.. చర్యలు తీసుకోవాలని ఏఆర్ సాదు యాదవ్ డిమాండ్ సబ్ హెడ్: డి. పోచంపల్లి సర్వే నెం.120/3లో 2,000 గజాల ఓపెన్ స్థలాన్ని అక్రమంగా ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారని ఆరోపణ
Quick Summary:
డి. పోచంపల్లి సర్వే నెం.120/3లో 2,000 గజాల
