*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ఎల్‌ఐసీ కార్యాలయంలో భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సంఘం (బ్లియాస్) ఆధ్వర్యంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భారతమాత చిత్రపటంతో పాటు భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకులు పరమపూజనీయ దత్తోపంత్ తేంగడి చిత్రపటాలకు సంఘ నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఎంఎస్ పతాకాన్ని ఆవిష్కరించి, సంఘం ఆశయాలు, కార్మిక సంక్షేమం కోసం బీఎంఎస్ అందిస్తున్న సేవలను వివరించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ, "దేశ హితం – పరిశ్రమ హితం – ఏజెంట్ల హితం" అనే ధ్యేయంతో భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, జాతీయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగులు, కార్మికులు, బీమా ఏజెంట్ల సంక్షేమమే సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గౌరవ అధ్యక్షులు మాంకాల లక్ష్మయ్య, అధ్యక్షులు ఎర్రమరాజు సాయికృష్ణ, బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు చామకూర రాజయ్య, ప్రధాన కార్యదర్శి మగ్దం రాజిరెడ్డి, బీఎంఎస్ నాయకులు కంది కొండల్ రెడ్డి, దోస్తులు మల్లేశం తదితర సంఘ నాయకులు, సభ్యులు, ఎల్‌ఐసీ ఏజెంట్లు పాల్గొని 72వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Telangana
*భారతీయ మజ్దూర్ సంఘ్ 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బ్లియాస్*
Quick Summary:
బీఎంఎస్) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని