నేటి సాక్షి గజ్వేల్ : -==
ఆర్టీసీ కార్మికులను నామమాత్రంగా ప్రభుత్వంలో విలీనం చేయడం కాకుండా, పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని హక్కులు, సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వద్ధామ రెడ్డి డిమాండ్ చేశారు. దశాబ్దం తర్వాత జరుగుతున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోను గురువారం సందర్శించిన ఆయన ఆర్టీసీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు సీలింగ్ లేకుండా గ్రాండ్ డ్యూటీ అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎన్‌డబ్ల్యూ (NW) యాక్ట్‌ను అమలు చేయడంతో పాటు యూనియన్ ఎన్నికల కమిటీల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
గత పాలనలో గ్రేడ్–3 పేరుతో కార్మికులను మోసగించారని ఆరోపించిన అశ్వద్ధామ రెడ్డి.. ఇకపై ఆర్టీసీలో పారదర్శక పాలన సాగాలని అన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె, ఉద్యమాల ఫలితంగానే 4,500 మంది కార్మికుల రెగ్యులరైజేషన్ సాధ్యమైందని, 44 శాతం వేతనాల పెంపుతో పాటు మరో 11 శాతం జీతభత్యాల పెంపును కూడా సాధించామని పేర్కొన్నారు.
రానున్న యూనియన్ ఎన్నికల్లో కార్మికుల హక్కుల కోసం పోరాడే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ మజ్దూర్ యూనియన్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు., రాష్ట్ర నాయకులు రాజలింగం, నిరంజన్, రీజినల్ నాయకులు km రెడ్డి, శ్యామ్ సుందర్, gv నర్సిములు డిపో సలహా దారులు rp రెడ్డి, A, నర్సిములు, డిపో అధ్యక్షులు prc రెడ్డి, డిపో కార్యదర్శి జక్కుల నర్సిములు, వర్కింగ్ ప్రసిడెంట్ అంబదాస్, సహాయ కార్యదర్శులు vs రెడ్డి, mm రాణి, లేడీస్ రీప్రజెంట్ ps రాణి, వయిస్ ప్రసిడెంట్ sm రెడ్డి, కృష్ణ,కవిత. భద్రప్ప, గ్యారేజ్ సెక్రటరీ md గఫుర్, కోశాధికారి bj రెడ్డి, డిపో కార్మికులు k, మహేష్,బీమ్ రెడ్డి, కిషన్, శెంకర్, ముత్యాలు, ms గౌడ్,యాదయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
Telangana
నామమాత్ర విలీనం వద్దు.. ప్రభుత్వ ఉద్యోగుల హోదా కావాలి దశాబ్దం తర్వాత యూనియన్ ఎన్నికలు.. కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యం: తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వద్ధామ రెడ్డి
Quick Summary:
దశాబ్దం తర్వాత యూనియన్ ఎన్నికలు.. కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యం: తెలంగాణ మజ్దూర్

