నేటి సాక్షి గజ్వేల్ :==
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని శాకారం గ్రామంలో గురువారం సర్పంచ్ మహమ్మద్ గోరేమియాతో కలిసి మహిళా సంఘ భవనం, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 55 గ్రామాలకు మహిళా సంఘ భవనాలు మంజూరయ్యాయని, ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.5.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రామాల్లో మహిళా సంఘాల కార్యకలాపాలకు శాశ్వత వేదికలు ఏర్పడనున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి తొలి విడతలో రూ.5.41 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు.
నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తున్నామని, ఇప్పటివరకు 6 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని, అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ, సన్నధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్, రైతు భరోసా తదితర హామీలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గజ్వేల్ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం సమృద్ధిగా కేటాయిస్తోందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్, కాంగ్రెస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మండల బాధ్యుడు సాయిగౌడ్, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Telangana
పల్లె అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట: రూ.5.50 కోట్లతో మహిళా భవనాలు – తూంకుంట నర్సారెడ్డి
Quick Summary:
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం