నేటి సాక్షి జూలై 23 నంద్యాల:-నంద్యాల నియోజకవర్గంలో సామాజికవేత్త గోళ్ళ రాజేష్ ఆద్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు, సమాజ సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయ,సహకారాలు అదేవిధంగా ఇప్పటికే పలు దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి ఆర్థిక సహకారాలు అందించారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల మండలంలోని, చాబోలు గ్రామంలోని ఉమ్రే ఫారుక్ మసీదు నిర్మాణ అభివృద్ధి కొరకు నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడైన గోళ్ళ రాజేష్ మసీదు నిర్మాణ అభివృద్ధి కొరకు 1,50,000/- లక్ష ,యాభై వేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు.
ఈ సందర్భంగా మసీదు ముత్తవల్లి ఆరీఫుద్దీన్, కమిటీ సభ్యులు మాట్లాడుతూ గొప్ప సమాజ సేవకుడు గోళ్ళ రాజేష్ నంద్యాల నియోజకవర్గ వర్గంలో చేస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సహాయ, సహకారాలు, ఆర్థిక సహకారాలు, దేవాలయాల నిర్మాణ అభివృద్ధి కొరకు, మసీదు నిర్మాణాల అభివృద్ధి పనుల కొరకు చేస్తున్న ఆర్థిక సహకారం చాలా విలువైనదని గోళ్ళ రాజేష్ కు అల్లాహ్ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని గోళ్ళ రాజేష్ ను అల్లా ఎప్పుడు చల్లగా చూడాలని ప్రత్యేక దువా, ప్రార్థనలు చేయడం జరిగింది. అనంతరం మసీదు నిర్మాణ అభివృద్ధి కొరకు ఆర్థిక సాయం చేసినందుకు సామాజికవేత్త గోళ్ళ రాజేష్ కు ఉమ్రే ఫారుక్ మసీదు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
మసీదు ముత్తవల్లీ ఆరీఫ్ ఉద్దీన్, సెక్రటరీ మొహమ్మద్ రఫి,జనరల్ సెక్రటరీ కరీముల్లా,హాఫిస్ అనస్, అబ్దుల్ హమీద్,ముస్తాక్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
Telangana
* *చాబోలు ఉమ్రే ఫారుక్ మసీదు అభివృద్ధికి 1,50,000/- ఆర్థిక సహకారం అందించిన సామాజికవేత్త గోళ్ళ రాజేష్* * *ఏ కులమైన మంచి మనసుంటే చాలు..సేవకు అడ్డు కాదు అని నిరూపిస్తున్నారు..గోళ్ళ రాజేష్*
Quick Summary:
ఏ కులమైన మంచి మనసుంటే చాలు..సేవకు అడ్డు కాదు అని నిరూపిస్తున్నారు..గోళ్ళ రాజేష్*

