Telangana
*సకాలంలో సభ్యత్వాలు పూర్తి చేయాలి* 👉 నాబార్డ్.. డీడిఎం రవీందర్ .. నేటి సాక్షి చిలుకూరు
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు నాబార్డ్
సూర్యాపేట జిల్లా చిలుకూరు నాబార్డ్ సహకారంతో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కోఆర్డినేషన్ లో చిలుకూరు మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న భానుపురి డైరీ రైతు ఉత్పత్తిదారుల మ్యాక్స్ లిమిటెడ్ డైరెక్టర్ల సమావేశానికి నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ సూర్యాపేట ( డిడిఎం ) రవీందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరీ మలోపేతానికి డైరెక్టర్లు రైతుల నుంచి సభ్యత్వాలు సేకరించి నాబార్డ్ నుండి వచ్చే నిధులు తో డైరీ డెవలప్మెంట్ కు డైరెక్టర్లు ప్రధాన పాత్ర పోషించాలాన్నారు. త్వరలో స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి తో త్వరలోనే ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఐ.ఆర్.డి.ఎస్ నిర్వాహకులు రమేష్ సీఈవో అఖిల్ తాత్కాలిక చైర్మన్ కొడారు రాము, డైరెక్టర్లు నెల్లూరి నాగేశ్వరావు, పులగం ప్రభాకర్,కందుకూరి కృష్ణమూర్తి, కోడారు రాంబాబు, ఉబ్బపల్లి మంగమ్మ మాతంగి వీరస్వామి రైతులు పాల్గొన్నారు.