నేటి సాక్షి కూకట్పల్లి జులై 26 (ప్రసాద్) : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి వనం అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో గౌరవ తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తులసి వనం అపార్ట్మెంట్స్ వారు ఇతర కాలనీల కు ఆదర్శంగా నిలిచారు అని, మొక్కలు నాటి హరిత వనం గా విరాజిల్లలనీ ,ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత గా మొక్కలు నాటాలని ,మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని,మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని, సమస్త జీవ కోటికి ప్రాణధారం మొక్కలు అని,అడవుల శాతం పెంచే లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి-వాటిని కాపాడాలిఅని, ,కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం గూర్చి ప్రతి ఒక్కరికి తెలుసునని కావున దీనిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు తప్పనిసరిగా నాటాలని , మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.అదేవిధంగా ఖాళీ స్థలాలు,రోడ్లకు ఇరువైపులా,అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలి అని ,నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలని, మొక్కలు నాటాడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అని,మొక్కలను చిన్న పిల్లలు పెంచినట్టు పెంచాలని, పిల్లలు, మహిళలు, యువకులు వృద్ధులను మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడం చాలా అభినందనీయం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయలు మరియు తులసి వనం అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి వనం అపార్ట్మెంట్స్
Quick Summary:
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి వనం అపార్ట్మెంట్స్