నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారి వెంబడి ప్రభుత్వ పాఠశాల గదులను, ప్రహరీ ఆధారంగా చేసుకొని నిర్మించిన పలు దుకాణాలపై ఇటీవల "అధికారులే అండగా.. పాఠశాల ప్రహరీనే ఆధారం " నేటి సాక్షి దినపత్రికలో ప్రచురితం కావడంతో స్పందించిన జాతీయ రహదారి అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది. రహదారి వెంబడి స్థలాన్ని ఆక్రమణ చేసి దుఖానాలను ఏర్పాటు చేయడం వలన పాఠశాల విద్యార్థులకు, ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా తొలగించడానికి మాత్రం ముందుకు రాలేదని పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో అధికారులు తొలగించారని పలువురు బహిరంగంగా అనుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Telangana
*ఎట్టకేలకు దుఖానాలా తొలగింపు....*
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని

