ప్రజా అంకితం పాములపాడు:-
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో గంట స్వామిరెడ్డి భౌతికకాయానికి టీడీపీ జనసేనా సీపీఐ తదితర నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా వారు పార్టీ లకు అతీతంగా వచ్చి ఈయన గురించి కొన్ని ముఖ్య విషయాలు పలువురు పార్టీ నాయకులు గంటా.స్వామి రెడ్డి గురించి మాట్లాడుతూ సొంత గ్రామం లింగాలలో ప్రజాతంత్ర యువజన సంఘం అధ్యక్షుడిగా, సీపియం పార్టీ సభ్యుడుగా కొనసాగాడని వివాహానంతరం వేంపెంట గ్రామంలో స్థిరపడి వ్యవసాయం చేసుకుంటూ రైతుగా మంచి గుర్తింపు కలిగి ఉండేవాడని సాధారణ పంటలతో పాటు సేరికల్చర్ (పట్టు)పసుపు, మిర్చి వాణిజ్య పంటలను పండిస్తూ ఆ రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డివిజన్ కమిటీ సభ్యుడుగా ఉంటూ అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడనీ, ఎస్ ఆర్ ఎం సి పై, వెలుగోడు రిజర్వాయర్ పై ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి లింగాల, చెలిమెల్ల, ఇస్కాల, వేంపెంట, వెలుగోడు, బానగచర్ల గ్రామాల్లో మెట్ట భూములకు సాగునీరు ఇవ్వాలని సీపీఎం పార్టీలో చేరి, రైతు సంఘం ఏర్పాటుచేసి, అనేక పోరాట కార్యక్రమాల్లో పాల్గొని, రైతు ఉద్యమానికి సహకరించే గంటా.స్వామిరెడ్డి అనారోగ్యంతో చనిపోవడం ఎంతో బాధాకరమని స్వామి రెడ్డికి జోహార్లర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతినీ తెలియజేయడం జరిగింది.
Andhra
*గంట.స్వామి రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన రైతు సంఘం, జనసేన, టిడిపి నాయకులు*
Quick Summary:
ప్రజా అంకితం పాములపాడు:-