నేటి సాక్షి ధర్మపురి దివ్యాంగులను సానుభూతితో కాకుండా సమానత్వ దృక్పథంతో చూడాలి..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
దివ్వాంగులకు నియో ఫ్లై బోల్ట్ పవర్ వీల్‌చైర్ల పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్.।
హైదరాబాద్:
దివ్యాంగులను సమాజంలో సానుభూతితో కాకుండా సమానత్వ దృక్పథంతో చూడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.దివ్యాంగులకు చేయూత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమూద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో హ్యుందాయ్ మొబిస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన (యాక్సెసిబిలిటీ అండ్ ఫ్రీడమ్) కార్యక్రమంలో దివ్వాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగులు, వృద్ధులు & ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 90 మంది దివ్యాంగులకు నియో ఫ్లై బోల్ట్ పవర్ వీల్‌చైర్లన్లు ఈసందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటిసేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మానవతా దృక్పథంతో కాకుండా సమానత్వ దృక్పథంతో చూడాలని మంత్రి అడ్డూరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ చిన్న శ్రీశైలం యాదవ్, జాతీయ దివ్యాంగుల హక్కుల సంఘం అధ్యక్షులు తుడుం రాజేందర్, దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షఫీ అహ్మద్ ఖాన్, ప్రభాంజాన, CSR జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Telangana
దివ్యాంగులను సానుభూతితో కాకుండా సమానత్వ దృక్పథంతో చూడాలి..
Quick Summary:
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
