*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
గాజులరామారం సర్కిల్ మహాదేవపురం డివిజన్ యండమూరి లేఔట్ కాలనీకి చెందిన బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్, అడ్వకేట్ మాడపాటి శివానంద్ జన్మదిన వేడుకలు సోమవారం గాజులరామారంలోని ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ రామారావు, వీణా వరకాల ,మధుసూదన్,శ్రీనివాస్ ,బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బక్క శంకర్ రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘాల సభ్యులు హాజరై శివానంద్‌కు పూల మాలలు వేసి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా మహాదేవపురం డివిజన్‌లోని పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, సంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, హిందూ సంఘాల నాయకులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు, జర్నలిస్టు అసోసియేషన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు సుగ్రీవుడు ముదిరాజ్‌తో పాటు సీనియర్ జర్నలిస్టులు భాన్స్వాడ వెంకటేష్, గణేష్, బాలరాజ్, కే.ఎస్. రాజు, బక్కని పాండు ముదిరాజ్, యాకూబ్, శివకుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకలు ఆత్మీయ వాతావరణంలో సాగగా, హాజరైన ప్రముఖులు అడ్వకేట్ శివానంద్ సామాజిక సేవలను అభినందిస్తూ, ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Telangana
*ఘనంగా అడ్వకేట్ మాడపాటి శివానంద్ జన్మదిన వేడుకలు*
Quick Summary:
గాజులరామారం సర్కిల్ మహాదేవపురం