నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వేలాది మంది ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మిర్యాలగూడ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యమకారులు, కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ తన నివేదికను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి, ఆ నివేదిక ఆధారంగా వెంటనే అమలు చర్యలు చేపట్టాలని ఫోరం డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితమని, ఆ ఉద్యమ విజయానికి ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, ప్రజా సంఘాలు విశేష కృషి చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు, గౌరవం, అవకాశాలు పూర్తిస్థాయిలో అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఏర్పాటు చేసిన కేకే కమిటీ నివేదికను ఆలస్యం చేయకుండా పూర్తి చేసి, అర్హులైన ఉద్యమకారులకు గుర్తింపు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రయోజనాలను వెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మాలోతు దశరథ నాయక్, మాడుగుల శ్రీనివాస్, నకిరేకంటి కిరణ్ కుమార్, బంటు వెంకటేశ్వర్లు, ఎస్.కె. ఇక్బాల్ (ఆర్టీసీ), గంధం సైదులు, జంగం శ్రీనివాస్, ఎం.డి. మహమూద్, ఎర్రబెల్లి దుర్గయ్య, గొప్పని నగేష్, తాళ్లపల్లి నరసయ్య, సామ కోటయ్య, దాసరాజు జయరాజు తదితరులు పాల్గొన్నారు.
Telangana
తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలి -కేకే కమిటీ నివేదికను వెంటనే పూర్తి చేసి అమలు చేయాలి -మిర్యాలగూడ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్
Quick Summary:
-కేకే కమిటీ నివేదికను వెంటనే పూర్తి చేసి అమలు చేయాలి