నేటి సాక్షి ధర్మపురి *ధర్మపురిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ*
*ధర్మపురి, ఆగస్టు 1*
*ధర్మపురి మండలానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు.*
*ఈ సందర్భంగా మొత్తం 10 మంది లబ్ధిదారులకు సుమారు రూ.10 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.*
*చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.*
Telangana
*ధర్మపురిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ*
Quick Summary:
ముబారక్ పథకాల లబ్ధిదారులకు

