Telangana
తెలంగాణ రాష్ట్ర ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా, రాష్ట్ర
Quick Summary:
తెలంగాణ రాష్ట్ర ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా, రాష్ట్ర
నేటి సాక్షి కూకట్పల్లి ఆగస్టు 01 ( షకీల్ ) : తెలంగాణ రాష్ట్ర ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ ద్వారా కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో 138 గుళ్ళకు ఇస్తున్న ఆర్థిక సహాయ నిధుల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు కూకట్పల్లి నియోజకవర్గంలోని భరత్ నగర్ శ్రీ హరిహర క్షేత్రం ఆలయ ప్రాంగణంలో జరిగింది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బండి రమేష్ చేతుల మీదుగా, దయార్గూడా త్రిమాత ఆలయ కమిటీ (ఎర్ర పోచమ్మ, నల్ల పోచమ్మ, చిత్తారమ్మ తల్లీ గుళ్ళ) గుళ్ళ కమిటీ ప్రెసిడెంట్ పెద్దలు, జక్కుల యాదగిరి,జనరల్ సెక్రటరీ గుండమల్ల రాజేంద్ర కుమార్ ప్రభుత్వం అందించిన చెక్కును స్వీకరించడం జరిగింది.