నేటి సాక్షి ధర్మపురి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల పుణ్యక్షేత్రం లో శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్సీ ఎల్. రమణ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ మంత్రి శ్రీ టి. జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్ దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అనంతరం ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పరిశీలించారు
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ, ఆనాటి ప్రభుత్వాలకు సరైన దృష్టి, ఆలోచన లేకపోవడం వల్ల నీటిని నిల్వ చేసి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయలేకపోయారని విమర్శించారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా కాలువలు తవ్వి, రూ. 6,000 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు
తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద గేట్లు అమర్చలేదు, నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు రాయపట్నం వంతెన పనులు కూడా పూర్తి కాలేదని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ, నీటిపారుదల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
యుద్ధప్రాతిపదికన రాయపట్నం బ్రిడ్జి పనులను పూర్తి చేసి, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గేట్లు అమర్చి నీటిని నిల్వ చేయడం జరిగిందన్నారు.
ఎల్లంపల్లిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా రీడిజైన్ చేసి, గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతానికి పూర్తిస్థాయిలో వినియోగపడేలా చేశారని వివరించారు.
ఎల్లంపల్లి అనేది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకముందు ఎల్లంపల్లి విస్తృత వినియోగంలోకి రాలేదని, అది కేవలం నీటిని నిల్వ ఉంచే పరిమిత పాత్ర పోషించిందని చెప్పారు.
కాళేశ్వరం ప్రారంభించిన తర్వాతే అన్నారం సుందిళ్ల, ఎల్లంపల్లి వరకు అలాగే అక్కడ నుండి నంది మేడారం, కొండ పోచమ్మ సాగర్ వరకు విస్తృత స్థాయిలో నీటిని ఎత్తిపోసే అవకాశం కలిగిందన్నారు.
మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు ఉన్న మూడు బ్యారేజీల నిర్మాణ వ్యయం మొత్తం రూ. 94,000 కోట్ల బడ్జెట్‌లో దాదాపు 10% పరిధిలోనే ఉందని, మిగిలిన భారీ భాగం మిగతా రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, గ్రావిటీ కెనాళ్ల నిర్మాణానికే వెచ్చించబడిందని వివరించారు.
కాళేశ్వరం అనేది కేవలం ఒక్క స్థానానికి లేదా ఒక్క బ్యారేజీకి పరిమితమైనది కాదని, అనేక రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, కెనాళ్ల కలయికతో ఏర్పడిన అతిపెద్ద ఎత్తిపోతల పథకమని స్పష్టం చేశారు.
నిర్మాణాలు గనుక పూర్తికాకపోతే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఏ విధంగా వెళ్తాయో ప్రభుత్వం చెప్పాలి. ఆకాశం నుండి పోతాయా లేదా ఏమైనా మాయా మంత్రాలు చేస్తారా..? అని ఎద్దేవా చేశారు
ప్రస్తుతం వర్షాలు పడి నీళ్లు రావడంతో రైతులు ఉపశమనం పొందారని. నీళ్లు రాకముందు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ డిమాండ్ చేశారు.
డిమాండ్ చేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దేవుడు కరుణించి వర్షాలు పడి నీళ్లు వస్తే, ఆ నీళ్లను కూడా రాజకీయం చేస్తూ కెసిఆర్ , కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే అక్కడికి నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో ప్రజలు గమనించాలి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను, నిజాలను ప్రజలకు తెలియజెప్పడానికే ఈ సందర్శన ఏర్పాటు చేసుకున్నాం అని కొప్పుల ఈశ్వర్ అన్నారు
Telangana
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల పుణ్యక్షేత్రం లో శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి
Quick Summary:
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల పుణ్యక్షేత్రం లో శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి

