నేటి సాక్షి కూకట్పల్లి ఆగస్టు 2 (షకీల్ ) మూసాపేట బోనాల మహోత్సవాల్లో ఘనంగా పాల్గొన్న బండి రమేష్
ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేటలో మైసమ్మ తల్లి దేవాలయం, ఉప్పలమ్మ తల్లి దేవాలయం, బీరప్ప స్వామి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ *బండి రమేష్* భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి రమేష్ , రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తూము వేణు, రఘు, సంతోష్, వినయ్, రజనీకాంత్, ఎల్లారావు, సర్పంచ్ శ్రీను, రాజు, విజయలక్ష్మి, బాలరాజు, వాసు తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Telangana
ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా
Quick Summary:
ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా