*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
ప్రజావాణిలో జీసీఎంసీ డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్ కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వి.నరేందర్ రెడ్డి.
రానున్న బోనాల పండుగ సందర్భంగా జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని 286, 287 డివిజన్లలోని దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుల వి. నరేందర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో జీసీఎంసీ డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా వి. నరేందర్ రెడ్డి చేసిన ప్రధాన డిమాండ్లు
1. దేవాలయాల పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి.
2. చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలి.
3. భక్తులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలి.
4. అన్ని వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.
5. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.
6. డ్రైనేజీలను పూర్తిగా శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలి.
7. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి.
ఈ సందర్భంగా వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా వేలాదిమంది భక్తులు దేవాలయాలను సందర్శించే నేపథ్యంలో అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేసి పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వెలుగులు, డ్రైనేజీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా కల్పించాలని కోరారు. భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపత్రం సమర్పించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆటో బలరాం, రామచంద్ర రెడ్డి, రామ్మోహన్, వెంకటేష్ బాబు తదితరులు పాల్గొని, బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టి అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Telangana
*బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి*
Quick Summary:
ప్రజావాణిలో జీసీఎంసీ డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్ కు వినతిపత్రం