*నేటిసాక్షి* ఆగస్టు 3
తిరుమలాయపాలెం (రుద్రరాజు).
పేదల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల వివిధ కారణాలతో మృతిచెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.
తిరుమలాయపాలెం మండల పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరా తండా, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట, పాతర్లపాడు, గోల్‌తండా, చంద్రుతండా, మేకలతండా, మేడిదపల్లి, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా, రఘునాథపాలెం, కాకరవాయి, జూపెడ, రాజారం, బచ్చోడుతండా, బచ్చోడు, బీరోలు, ఏలువారిగూడెం, దమ్మాయిగూడెం, ఎర్రగడ్డ తండా మొత్తం 26 గ్రామాలు. ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున 60 కుటుంబాలకు 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమం ద్వారా బాధిత కుటుంబాలకు ఆపద్బాంధవుడిగా నిలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ ,పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే నాయకుడు ఆపదలో ఉన్న కుటుంబాలకు వెంటనే స్పందించి చేయూత అందించడం ఆయన సేవా తత్వానికి నిదర్శనం. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు అని అన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ధైర్యాన్ని, భరోసాను కల్పిస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్ ,వనవాసం నరేందర్ రెడ్డి, బొల్లికొండ రాజశేఖర్, లంజపల్లి శ్రీనివాస్, కట్కూరి శ్రీనివాసరెడ్డి, ఉప్పునూతల నాగేశ్వరరావు, తవడ బోయిన కృష్ణ, దారావత్ సుజాత ,తాటికొండ కిరణ్, చామకూరి శ్రీనివాస్, దొడ్డ గురవయ్య, షేక్ సలీం, రావూరి యాకోబు రావు, పుసులూరి రమేష్ ,పోట్ల కిరణ్ ,అన్నేపర్తి రవి, జడల నగేష్ గౌడ్, బానోత్ సుజాత అనిల్ కుమార్ షేక్ నజీర్ సయ్యద్ మదర్ డీలర్ మోర అనిల్ రెడ్డి వోర వెంకటేశ్వర్లు రామ సహాయం అరవింద రెడ్డి రామ సహాయం హరిత రెడ్డి నందిపాటి మల్లికార్జున్ గొర్రెపాటి రవీందర్ ఉన్నం రాజశేఖర్ నల్లమల్ల కీర్తి నిరన్ కుమార్ మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లమల్ల ప్రతాప్ గద్దల సుధాకర్ మందుల అరుణ ఈదయ్య తదితరులు పాల్గొన్నారు
Telangana
*ఆపదలో అండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మృతుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం* పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల బాధిత కుటుంబాలకు చేయూత
Quick Summary:
పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల బాధిత కుటుంబాలకు చేయూత