Telangana
*ఎస్సైని కలిసిన మాల సంఘం నూతన కార్యవర్గం*
Quick Summary:
ఎస్సైని కలిసిన మాల సంఘం నూతన కార్యవర్గం*
*ఎండపల్లి (నేటి సాక్షి):* వెల్గటూర్ మండల కేంద్రంలోని మాల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం స్థానిక ఎస్సై పి.ఉదయ్ కుమార్ ను సోమవారం రోజున మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతన కమిటీ ఎన్నికైన నేపథ్యంలో ఎస్సైని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. సంఘాన్ని ఉన్నతమైన ఆదర్శాలతో ముందుకు తీసుకెళ్లాలని, సమాజ శ్రేయస్సు కోరి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఐక్యతతో పనిచేస్తే సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు ఆదర్శంగా నిలిచే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం గౌరవ అధ్యక్షులు మూగల శ్రీనివాస్, అధ్యక్షులు మూగల సతీష్, ఉపాధ్యక్షులు పొనగంటి రాజేందర్, కోశాధికారి మూగల శేఖర్, సభ్యులు లకుమల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.