నేటిసాక్షి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ సబ్-కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజనల్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 15 వినతులు వివిధ శాఖలకు సంబంధించినవిగా అంచినట్లు మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ అధికారి రమణారెడ్డి తెలిపారు. అందిన వినతుల్లో అత్యధికంగా మిర్యాలగూడ సబ్-కలెక్టర్ కార్యాలయానికి 6 వినతులు నమోదయ్యాయని, అనంతరం మిర్యాలగూడ డివిజనల్ పంచాయతీ కార్యాలయానికి 1, మిర్యాలగూడ తహశీల్దార్ కార్యాలయానికి 2, మాడ్గులపల్లి తహశీల్దార్ కార్యాలయానికి 1, నిడమనూరు తహశీల్దార్ కార్యాలయానికి 2, త్రిపురారం తహశీల్దార్ కార్యాలయానికి 1, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి 1, డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయానికి 1 వినతి అందినట్లు వెల్లడించారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం సమర్థవంతమైన వేదికగా కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బాధితులు, తదితరులు పాల్గొన్నారు.
Telangana
ప్రజావాణిలో 15 వినతులు స్వీకరణ : ఆర్డీఓ రమణారెడ్డి
Quick Summary:
మిర్యాలగూడ సబ్-కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన