నేటి సాక్షి ఆగస్టు 03
పెద్దకడబురు ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి జిల్లా బహిష్కరణ చేయాలని కర్నూలు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొగ్గుల నరసన్న డిమాండ్ చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని నెమకల్--సంగాల జంట గ్రామాల్లో దళిత కుటుంబాల పై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. దళితులు నివాసముంటున్న నాగరాజు, సుచిత్ర ఇళ్లలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన దళిత మహిళలపై కూడా దాడి చేశారని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగేందుకు అర్హులు కారని పేర్కొంటూ, ముఖ్యమంత్రి, గవర్నర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే విరుపాక్షిపై చర్యలు తీసుకోవాలని బొగ్గుల నరసన్న కోరారు.
Andhra
దళిత కుటుంబాలపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే విరుపాక్షిని పదవి నుంచి తొలగించాలి _ కర్నూలు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొగ్గుల నరసన్న డిమాండ్
Quick Summary:
_ కర్నూలు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొగ్గుల నరసన్న డిమాండ్