నేటి సాక్షి,కుల్కచర్ల
(సురేష్ మోత్కూర్ ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్ ఉపాధ్యాయుల గౌరవ వేతనాన్ని పెంచాలని గిరిజన సంక్షేమ శాఖ ఏడి సర్వేశ్వర్ రెడ్డికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఆగస్టు 17న చేపట్టే నిరవధిక దీక్ష సమ్మె నోటీసును అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 - 16 విద్య సంవత్సరం నుండి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న రెగ్యులర్,సిఆర్టి ఉపాధ్యాయులతో పాటు సమానంగా విద్యా అర్హతలు ఉండి వారితో పాటు సమానంగా విద్యాబోధన చేస్తున్న మాకు నెలకు 10,300 వేతనం మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెలసరి వచ్చిన జీతంతో నిత్యవసరాల సరుకులను కొనలేక కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నారు.సియార్టీలకు ఇచ్చే గౌరవ వేతనంతో మాకు కూడా అలాంటి గౌరవ వేతనము అందివాలని మా యొక్క ఫైల్ ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉందని,ప్రభుత్వ అధికారులకు,రాజకీయ ముఖ్య నాయకులకు,ప్రభుత్వం దృష్టికి పలుమార్లు విన్నవించిన ఎలాంటి స్పందన లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.సిఆర్టిలతో కూడిన గౌరవ వేతనం పెంపుదల కొరకు ఆగస్టు 17న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 339 మంది అకాడమి ఇన్ స్ట్రక్టర్ ఉపాధ్యాయులతో భారీ ఎత్తున నిరవాదిక సమ్మె దీక్ష చేపడుతున్నామని హెచ్చరించారు. ఆగస్టు 17 తారీకు వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మాకు గౌరవ వేతనం వచ్చేలా చూడండి. లేకపోతే ప్రభుత్వం ఫై వత్తిడి చేస్తామని,నిరవధిక సమ్మెను మాత్రం ఆపే ప్రసక్తే లేదని ఖండిస్తూ వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
Telangana
*సమాన పనికి - సమానం వేతనం ఇవ్వండి* *రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 339 మంది ఉపాధ్యాయుల ఆవేదన.* *ఆగస్టు 17న నిరవధిక సమ్మె చేపడుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఏడి సర్వేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేత.* *రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్.*
Quick Summary:
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్.*