నేటిసాక్షి, మిర్యాలగూడ : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో మంగళవారం మిర్యాలగూడలో భారీ విద్యార్థుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని రాఘవ థియేటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సుమారు 1,500 మంది విద్యార్థులతో ర్యాలీ చేపట్టి, అనంతరం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థుల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా, వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రూ.10,500 కోట్ల మేర బకాయిలు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వాన్ని నిందిస్తూ బాధ్యత నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం పలుమార్లు సూచించినా, ప్రభుత్వం స్పందించడం లేదని వారు అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆగస్టు 6న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేస్తామని హెచ్చరించారు.
స్కాలర్షిప్‌లు విడుదల కాకపోవడంతో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు మూడవత్ రవినాయక్, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు మూడవత్ జగన్ నాయక్, కార్యదర్శి కుర్ర సైదా నాయక్, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్, లోహి, ఝాన్సీ, బన్ని, హనుమంతు, పవన్, బిస్మిల్లా, తరుణ్, సిపాయి, కల్పన, రాధిక, కళ్యాణి, స్పందన, శీరీష, కావ్య, అంజలి, మానస తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ –స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్
Quick Summary:
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్