నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిషత్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందటలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. మండల పరిషత్ పరిధిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పెద్ద తలకాయ గా ఉంటూ తాను చెప్పిందే వేదంగా, తన మాటే శాసనంగా చెలాయించుకుంటూ కిందిస్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతూ కార్యక్రమాలు చక్కదిద్దుకుంటున్న బాస్. ఈ బాస్ గతంలో ఎంపీఓగా విధులు నిర్వహించి ఇతర జిల్లాలో కొంతకాలం పనిచేసి తన రాజకీయ అండదండలతో తిరిగి ఇదే కార్యాలయంలో అదే స్థానంలో విధులకు హాజరయ్యాడు. వచ్చిన కొంత కాలంలోనే ఎంపీడీవో ఉద్యోగ విరమణ పొందటం ఇతనికి బాగా కలిసి వచ్చిందన్న వచ్చు. అదే తడవుగా మండలంలోని కొండాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఈ- పంచాయతీ పోర్టల్ నందు హౌస్ అసెస్మెంట్ నెంబర్:614 బెల్దే నాగయ్య స్థలం పాత రికార్డు పరంగా 98 గజాలు ఉండగా పంచాయతీ కార్యదర్శి ప్రమేయం లేకుండా తమ దర్పాన్ని ఉపయోగించి 753 గజాలుగా ఈ- పంచాయతీలో గత రెండవ శనివారం(11/07/2026) నాడు హడావుడిగా కంప్యూటర్ ఆపరేటర్ తో మార్పించేశాడు. కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ తనకు అనుకూలంగా చేసుకొని ఒకరిని తన వాహనానికి డ్రైవర్ గా, మరొకరిని లావాదేవీలలో మధ్యవర్తిగా వాడుకుంటున్నాడు. లావాదేవీలు చక్కబట్టే మధ్యవర్తి మండల పరిషత్ కి వచ్చే విధానం చూస్తే జిల్లాస్థాయి సుపీరియర్ అన్నట్లుగా అనిపిస్తుంది. సంబంధిత స్థల యజమానికి యాజమాన్య ధ్రువీకరణ పత్రం అవసరం రావడంతో గత నెలలోనే 15/07/2026న గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం మంజూరు చేసే సమయంలో సదరు స్థలానికి సంబంధించి రికార్డును పరిశీలించి, ఆన్లైన్లో తనిఖీ చేసి స్థల కొలతలకు సంబంధించి వివరాలు అడగగా ఆన్లైన్లో ఉన్న దానికి, గ్రామపంచాయతీ రికార్డులకు పొంతన లేకుండా ఉన్నది. దీంతో అవాక్కైనా పంచాయతీ కార్యదర్శి తన ప్రమేయం లేకుండా స్థలంల్లో జరిగిన మార్పులపై జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీటన్నిటికీ మూలం పంచాయతీ కార్యదర్శుల యూజర్ ఐడి ఎంపీడీవోల చేతిలో ఉండడమే వారికి శాపంగా మారింది. ఇటీవల కాలంలో మండల కేంద్రంలో, మండలంలోని నారాయణపురంలో, నేడు కొండాపురంలో జరిగిన వరుస సంఘటనలే బాసిజానికి బాటలు వేస్తున్నాయి.ఈ విషయంలో మండల బాస్ పై జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నారు.
Telangana
98 గజాలు.. 753 గజాలుగా మారిన రికార్డు!
Quick Summary:
*అంతా నా ఇష్టం.... నేను చెప్పిందే వేదం...*