నేటి సాక్షి కాగజ్నగర్ టౌన్ ఆగస్టు 6
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఈరోజు
మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన ఆశాజ్యోతి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను (బుల్లెట్ ప్రూఫ్ వాహనం, గన్ మెన్లను) తొలగించడాన్ని నిరసిస్తూ కాగజ్ నగర్ పట్టణంలో 'మహా ధర్నా' కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోషల్ మీడియా వింగ్ నాయకులు శ్రీ దొబ్బల మంగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా 5 వేల మందికి పైగా ఐపీఎస్ అధికారులు తమ వ్యక్తిగత స్వార్థాన్ని పక్కనపెట్టి, దేశ ప్రజల భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను తొలగించడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అత్యంత హీనమైన చర్య.
ఆయుధాలు లేకుండా, అడవుల్లోకి వెళ్లి నక్సలైట్లతో కేవలం మాటల ద్వారా చర్చలు జరిపి, ఎంతోమందిని జనజీవన స్రవంతిలో కలిపిన గొప్ప మేధావి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో మార్పు రావాలంటే అది కేవలం 'భారత రాజ్యాంగం' వల్లే సాధ్యమని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన.
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వ్యక్తుల నుండి కాకుండా, ఆయన ఏ భావజాలాన్ని అయితే ఎదిరించారో ఆ భావజాలం ఉన్న వారి నుండే ప్రాణహాని ఉంది. ఇలాంటి ముప్పు ఉన్నప్పటికీ, రక్షణ కల్పించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం "రాజకీయ కక్ష సాధింపు" కోసమే ఆయన సెక్యూరిటీని తొలగించడం అత్యంత బాధాకరం.
ప్రెసిడెంట్ మెడల్ సాధించిన ఒక మాజీ అడిషనల్ డీజీపీ (ADGP) స్థాయి అధికారికి ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైతే.. ఇక క్షేత్ర స్థాయిలో నిత్యం దొంగలు, భూకబ్జాదారులు, క్రిమినల్స్ తో పోరాడే కానిస్టేబుల్స్, ఎస్ఐలకు ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుంది? ఉన్నతాధికారికే రక్షణ లేకపోతే గ్రౌండ్ లెవల్ పోలీసుల మనోధైర్యం దెబ్బతింటుంది.
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.భద్రత కల్పించాల్సిన నైతిక, సామాజిక బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. వెంటనే ఆయనకు భద్రతను పునరుద్ధరించాలి.
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తక్షణమే భద్రత కల్పించని పక్షంలో, రాబోయే రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని శ్రీ దొబ్బల మంగేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Telangana
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపు కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపే! కాగజ్ నగర్ మహా ధర్నాలో సోషల్ మీడియా వింగ్ నాయకులు దొబ్బల మంగేష్ ధ్వజం
Quick Summary:
కాగజ్ నగర్ మహా ధర్నాలో సోషల్ మీడియా వింగ్