నేటి సాక్షి ఆగస్టు 06 నందికొట్కూరు:-
నందికొట్కూరు పట్టణంలోని, 20వ వార్డులో, రామాలయం వీధిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నిర్వహించిన ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి స్థానికులకు వివరించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసమే తమకు బలమని, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, నందికొట్కూరు పట్టణ నాయకులు డాక్టర్ డీ.వనజ, కార్యకర్తలు పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, అబ్జర్వర్ వెంకట శివుడు, పాణ్యం వేణుగోపాలు, పిఏ- మద్దిలేటి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Andhra
*ప్రజల ముంగిటకు సంక్షేమ పాలన- అభివృద్ధి మా లక్ష్యం:-గిత్త.జయసూర్య (నందికొట్కూరు ఎమ్మెల్యే)*
Quick Summary:
నందికొట్కూరు పట్టణంలోని, 20వ వార్డులో,
