నేటి సాక్షి,మునగాల
సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం తహసీల్దార్ సరిత అధ్యక్షతన అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ సరిత మాట్లాడుతూ మండలవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వేను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను ఆగస్టు 3 నాటికి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
సాంకేతిక కారణాలు ఇతర లోటుపాట్ల వల్ల ఇప్పటివరకు తమ వివరాలు నమోదు కాని అర్హులైన ఓటర్లు ఎవరైనా ఉంటే, వారు తమ గ్రామంలోని సంబంధిత బీఎల్‌ఓను సంప్రదించి ఆగస్టు 10లోపు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇది చివరి అవకాశమని స్పష్టం చేశారు.
మండలవ్యాప్తంగా ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, మరణించిన ఓటర్ల పేర్లు, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ చేసుకున్న వారి వివరాలను ఇప్పటికే ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్, సీపీఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, సీపీఐ నాయకుడు సీహెచ్ సీతారామ్, బీజేపీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, నాయకులు ఓరుగంటి రవి, సత్యనారాయణ రెడ్డి, దొంగరి శ్రీను, స్వరాజ్యం, కలకోవ సర్పంచ్ మండవ వెంకటాద్రి, ఆర్‌ఐ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Telangana
సర్ ప్రక్రియపై అఖిలపక్ష సమావేశం.. ఆగస్టు 10లోపు వివరాల నమోదుకు చివరి అవకాశం: తహసీల్దార్ సరిత..
Quick Summary:
ఆగస్టు 10లోపు వివరాల నమోదుకు చివరి అవకాశం: తహసీల్దార్ సరిత..