నేటి సాక్షి ఆగస్టు 10 పాములపాడు:-
ప్రతి సోమవారం మండలంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)కు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాములపాడు మండల తహాసిల్దార్ జీ.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్ లకు జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ ఎల్.నాగరాజు అధికారులకు విన్నవిస్తూ ఎన్నో సమస్యలతో ప్రజలు, రైతులు వారి సమస్యలు, కష్టాలు తీరుతాయని ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)కు వస్తారన్నారు. అయితే మండలంలో వివిధ శాఖల అధికారులు సరిగ్గా రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఒకవేళ వచ్చిన 12 గంటలకు వస్తున్నారని ఆయన వాపోయారు. కొంతమంది రైతులు, ప్రజలు వారికి సంబంధించిన అధికారులు రాక, వెనుదిరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని మండల తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్ లకు అన్ని శాఖల అధికారులు పిజిఆర్ఎస్ కు ఖచ్చితంగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విభిజి రాంజీ పథకం ఏపీవో- బి.జయంతి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ-సువర్చల, పశు వైద్యాధికారి పి.భాస్కర్, వీఆర్వోలు, తదితర శాఖల సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Andhra
*గ్రీవెన్స్ కు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్ లకు వినతి పత్రం సమర్పించిన డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు*
Quick Summary:
ఎన్.చంద్రశేఖర్ లకు వినతి పత్రం సమర్పించిన డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు*
