గజ్వేల్ మున్సిపల్ పరిణామాలపై సుదీర్ఘ చర్చ
ప్రజా సమస్యలపై పోరాడాలి.. పార్టీని బలోపేతం చేయాలి: కేసీఆర్
నేటి సాక్షి గజ్వేల్ : గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి సోమవారం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న స్థానిక సమస్యలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.
*అభివృద్ధి నిధులపై కృతజ్ఞతలు:*
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కేసీఆర్ అందించిన సహకారాన్ని రాజమౌళి గుర్తుచేశారు. మున్సిపల్ చైర్మన్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించడంతోపాటు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే గజ్వేల్ పట్టణ రూపురేఖలు మారాయని పేర్కొన్నారు.
*ప్రజాక్షేత్రంలో ఉండాలి:*
గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు స్థానిక నాయకత్వం చేస్తున్న కృషిని రాజమౌళి కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడాలని సూచించినట్లు తెలిసింది. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలబడే నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధిష్ఠానం అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు రాజమౌళి తెలిపారు.
Telangana
కేసీఆర్‌తో రాజమౌళి భేటీ
Quick Summary:
ప్రజా సమస్యలపై పోరాడాలి.. పార్టీని బలోపేతం చేయాలి: కేసీఆర్