నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండలం నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 12 హైరిస్క్ గ్రామాల్లో నిక్షయ్ శివిర్ ఫేజ్-2లో భాగంగా టీబీ స్క్రీనింగ్ కోసం మొబైల్ ఎక్స్‌రే క్యాంపులు నిర్వహించనున్నట్లు సోమవారం వైద్యాధికారి డాక్టర్. యు. సుస్మిత తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ఆగస్టు 11 నుంచి 24వ తేదీ వరకు ఈ క్యాంపులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
14 సంవత్సరాలు, అంతకంటే పైబడిన ప్రతి ఒక్కరికీ, టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా మొబైల్ ఎక్స్‌రే మిషన్ ద్వారా ఛాతీ ఎక్స్‌రేలు తీసి స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 11న పీహెచ్‌సీ నంది మేడారంలో, 12న రచ్చపల్లిలో, 13న శాయంపేటలో, 14న కొత్తూరులో, 15న చామనపల్లిలో క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ఆగస్టు 17న ఖానంపల్లిలో, 18న ఖిలావనపర్తిలో, 19న ఖమ్మర్‌ఖాన్‌పేటలో, 20న బొట్లవనపర్తిలో, 21న పత్తిపాకలో, 22న నర్సింగాపూర్‌లో, 24న దొంగతుర్తిలో మొబైల్ ఎక్స్‌రే క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
టీబీ లక్షణాలు లేని వారు సైతం పరీక్షలు చేయించుకోవచ్చని, వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు నిర్ణీత తేదీల్లో క్యాంపులకు హాజరై మొబైల్ ఎక్స్‌రే ద్వారా టీబీ స్క్రీనింగ్ చేయించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Telangana
*టీబీ స్క్రీనింగ్‌కు మొబైల్ ఎక్స్‌రే క్యాంపులు* *14 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీబీ పరీక్షలు* *టీబీ లక్షణాలు లేకున్నా పరీక్షలు తప్పనిసరి* - *వైద్యాధికారి డాక్టర్. సుస్మిత*
Quick Summary:
టీబీ లక్షణాలు లేకున్నా పరీక్షలు తప్పనిసరి*