నేటి సాక్షి ఆగస్ట్ 10 పాములపాడు:-
.పాములపాడు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు గుండాలనట్టు పెద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బాణాకచర్ల,గుండాలనట్టు గ్రామం పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు, జిల్లా సమితి సభ్యులు టి. ప్రతాప్ మండల కార్యదర్శి సుధాకర్ లు ప్రభుత్వాన్ని కోరారు.
* సోమవారం గుండాలనట్టు గ్రామం లో వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం లో అర్హులైన నిరుపేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.పట్టణంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని,పరిశుద్యం డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని, మండలంలోని ప్రతి ఏకరాకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశార్..*,ఈ కార్యక్రమం లో మండల నాయకులు ,సుధాకర్,లష్మిపతి, సామెల్,యేసేపు, మహిళ నాయకులు మూర్తుజాబీ,లక్ష్మిదేవి రానెమ్మ శిరీష, నాగశేషమ్మ, తదితరులు పాల్గొన్నారు..
Andhra
*పాములపాడు మండల ప్రజా సమస్యలు పరిష్కరించాలని గడప గడప కు పాదయాత్ర*.. *సీపీఐ*
Quick Summary:
పాములపాడు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో
