నేటి సాక్షి తొగుట... వడ్డె నర్సింలు
తుక్కాపూర్ గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ లింగాల నర్సవ్వ అకాల మరణం చాలా బాధాకరమని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. 2020 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘం ఎన్నికలలో తుక్కాపూర్ గ్రామం నుండి ఏకగ్రీవంగా లింగాల నరసవ్వ డైరెక్టర్గా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.లింగాల నరసవ్వ అకాల మరణం తీవ్రంగా కలిసి వేసిందని ఆమె గత రాత్రి అనారోగ్యంతో మరణించడం జరిగిందన్నారు. తుక్కాపూర్ స్వగృహంలో లింగాల నర్సవ్వ పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు పేర్కొన్నారు.లింగాల నర్సవ్వ కుటుంబానికి పాలకవర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.సొసైటీ డైరెక్టర్గా తమ పాలకవర్గంలో అందరితో కలుపుగోలుగా ఉండేదని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కురుమ యాదగిరి, డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, సీఈఓ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana
సొసైటీ డైరెక్టర్ లింగాల నర్సవ్వ అకాల మరణం చాలా బాధాకరం సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి
Quick Summary:
సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి