నేటి సాక్షి తొగుట... వడి నరసింహులు
తోగుటలో రాస్తారోకో నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు కార్మికులు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలి.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూల విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ బరో సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో ర్యాలీ అనంతరం రాస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు తొగుట మండల కన్వీనర్ ఏ. వసంత మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ,రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జైల్ భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసి కార్పొరేట్ పరిశ్రమ అధిపతులకు మేలు చేస్తుందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు అన్యాయం చేసే విధంగా విత్తన చట్టాన్ని తీసుకువచ్చి కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు అప్పగిస్తుందని దీనివల్ల రైతులు పూర్తిగా దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2025 విద్యుత్ సవరణ బిల్లు వలన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు కోల్పోయి విద్యుత్తు ప్రైవేటీకరణ జరుగుతుందని, దీనివల్ల రైతులకు ఉచిత విద్యుత్ కోల్పోయి విద్యుత్ బారాలతో ప్రజలు మోయలేని విధంగా తయారవుతుందని విమర్శించారు.విత్తన చట్టం మరియు విద్యుత్ సవరణ 2025 బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ విబి జిరామ్ జి చట్టంగా పేరు మార్పును వెనక్కు తీసుకొని ఉపాధి హామీ 2005 చట్టం యదావిధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ విధానాలను వెనక్కు తీసుకొని కార్మికులు,రైతులు,ప్రజలకు మేలు చేసే విధంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పుష్ప, శ్యామల, మాణిక్యం, నర్సింలు, రాణి, వరమ్మ, వినోద, భాగ్యలక్ష్మి, శాందుల, నాగరాజు, హేమలత, జాహ్నవి, పుష్పలత, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ బరో
Quick Summary:
తోగుటలో రాస్తారోకో నిర్వహిస్తున్న
