నేటిసాక్షి, మిర్యాలగూడ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండల ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీ సమావేశం మండల ఇంచార్జి సందాల శంభయ్య మాదిగ అద్యక్షతన సోమవారం నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ సాధించిన అనంతరం ఎమ్మార్పీఎస్ జాతీయ స్థాయిలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగల పేదరిక నిర్మూలన కోసం అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని వ్యవస్థ కోసం భవిష్యత్తు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ పోరాటానికి మాదిగలు మరింత శక్తివంతంగా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నుకున్నారు.
ఎమ్మార్పీఎస్ మండల కమిటీ వివరాలు.
అధ్యక్షులుగా: కోట రాజు మాదిగ
అధికార ప్రతినిధి: వట్టపు సైదులు మాదిగ
ప్రధాన కార్యదర్శిగా దోరేపల్లి సూర్య,
ఉపాధ్యక్షులు:
1.కారపాటి గాంధీ,
2.కొమ్ము పృధి రాజు,
కార్యదర్శి మంద శ్రీను,
ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులూ రేడపంగు జేయరాజు, గద్దల సత్యం, కోట ప్రసాద్, పోలెపల్లి బాబు, మంద నాగేంద్రబాబు, కోట నాగేశ్వరరావు, సందాల దేవయ్య, మాదిగ సందాల రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా కోట రాజు -మండల స్థాయి కమిటీ ఏర్పాటు
Quick Summary:
మండల స్థాయి కమిటీ ఏర్పాటు
