*నేటి సాక్షి – మెట్‌పల్లి*
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామానికి చెందిన జంగిటి రాజ్యలక్ష్మి–నరేందర్ దంపతులకు తొలి కాన్పులోనే ముగ్గురు శిశువులు జన్మించారు. సోమవారం ప్రసవం కోసం మెట్‌పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్న రాజలక్ష్మికి వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం నిర్వహించగా ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడశిశువులు జన్మించారు.
*ముగ్గురూ ఆరోగ్యంగా...*
జన్మించిన మగశిశువు 1.8 కిలోల బరువు ఉండగా, ఇద్దరు ఆడశిశువులు ఒక్కొక్కరు 1.5 కిలోల బరువుతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించడంతో రాజలక్ష్మి–నరేందర్ కుటుంబంలో ఆనందం నెలకొంది. బాబు, ఇద్దరు పాపలు జన్మించడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
_______
Telangana
*ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు* --------------------------- * రాజేశ్వరరావుపేట దంపతులకు తొలి కాన్పులోనే బాబు, ఇద్దరు పాపలు * తల్లి, చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యం --------
Quick Summary:
తల్లి, చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యం