నేటి సాక్షి,మునగాల
గర్భిణులు ఏఎన్‌సీ వైద్య పరీక్షలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ వినయ్‌కుమార్ సూచించారు. మంగళవారం కలకోవ సబ్‌సెంటర్‌లో నిర్వహించిన ఏఎన్‌సీ డే కార్యక్రమంలో కలకోవ, విజయరామపురం, జగన్నాధపురం గ్రామాలకు చెందిన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
*పోషకాహారంతో తల్లీబిడ్డల ఆరోగ్యం*
ఈ సందర్భంగా డాక్టర్ వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. గర్భిణులు పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు, పాలు తదితర పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు ఐరన్, క్యాల్షియం మాత్రలను క్రమం తప్పకుండా వినియోగించాలని తెలిపారు. గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంతోపాటు గర్భస్థ శిశువు ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏఎన్‌సీ పరీక్షలు ఎంతో కీలకమన్నారు.
*ప్రతి వారం సబ్‌సెంటర్‌లో* *ఏఎన్‌సీ డే*
గర్భిణుల కోసం ప్రతి వారం ఒక్కో సబ్‌సెంటర్‌లో ఏఎన్‌సీ డే నిర్వహిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని గర్భిణులు నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించవచ్చన్నారు. ఈ
కార్యక్రమంలో సూపర్వైజర్ భాస్కర్‌రాజు, నర్సింగ్ ఆఫీసర్ లక్ష్మి, ఫార్మసిస్ట్ శాంతయ్య, ల్యాబ్ టెక్నీషియన్ వి.ఫణిందర్, ఏఎన్‌ఎం మెడిసిన్ మెట్ల నరసమ్మ, ఆశా కార్యకర్తలు జి.భాగ్యలక్ష్మి, ఎస్.నాగమణి, డి.నాగమణి, కే.మరియమ్మతో పాటు గర్భిణులు పాల్గొన్నారు.
Telangana
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. ఏఎన్‌సీ చెకప్‌లను సద్వినియోగం చేసుకోవాలి.. డాక్టర్ వినయ్‌కుమార్..
Quick Summary:
డాక్టర్ వినయ్‌కుమార్..