నేటి సాక్షి ఆగస్ట్ 11 జూపాడుబంగ్లా :-
జూపాడుబంగ్లా మండలం జూపాడుబంగ్లా గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన “కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య వారు పాల్గొన్నారు. జూపాడుబంగ్లా ఎంపిడిఓ. గోపీకృష్ణ వారు ఎమ్మెల్యే వారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ శాలువాలతో సన్మానం చేసి టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. అనంతరం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.నందికొట్కూరు నియోజకవర్గం
జూపాడుబంగ్లా గ్రామంలో నిర్వహించిన “కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి & సంక్షేమం డోర్ టు డోర్ ప్రచారంలో నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలను గురించి ఎమ్మెల్యే గిత్త. జయసూర్య వారు మాట్లాడుతూ ప్రజలలో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన కార్యక్రమం కొన్ని ముఖ్య విషయాలు తెలపడమైనది అవి (1) ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ప్రతి నెలా రూ.4,000, రూ.6,000, రూ.10000, రూ.15000
(2) తల్లికి వందనం ఇంట్లో ప్రతి విద్యార్థికి .15,000
(3) దీపం-2 ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు,
(4) స్త్రీ శక్తి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం,
(5) చేనేతలకు 200, పవర్ లూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు,
(6) ఆటో డ్రైవర్ల సేవలో ఏటా రూ.15,000, అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు ఏటా రూ.20,000
(7) 269 అన్న క్యాంటీన్ల ద్వారా రూ. 5కే పేదలకు భోజనం
(8) పేదలకు 5 లక్షల ఇళ్లు, పంపిణీకి సిద్ధంగా మరో 5 లక్షల ఇళ్లు
(9) గీత కార్మికులకు మద్యం షాపులు, వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు
(10) ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత వైద్యసేవలు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం,
(11) మత్స్యకారుల సేవలో ఏటా రూ.20,000 సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో:- జూపాడుబంగ్లా మండల కూటమి నాయకులు పిక్కిలి . శ్రీనివాసులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది
Andhra
ప్రతి ఇంటికి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల ఆదరణతో ఆశీస్సులతో దూసుకుపోతున్న ఎమ్మెల్యే గిత్త. జయసూర్య. ప్రజల ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన కార్యక్రమం..ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే గిత్త జయసూర్య.
Quick Summary:
ప్రజల ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు
