నేటి సాక్షి తొగుట... వడ్డే నరసింహులు
తొగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన PACS డైరెక్టర్ లింగాల నర్సవ్వ నిన్న మృతి చెందడంతో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా నర్సవ్వ కుటుంబ సభ్యులను కలిసి ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నర్సవ్వ మృతి కుటుంబానికి, గ్రామానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు, మాజీ అధ్యక్షులు ఆక్కం స్వామి, నాయకులు పాగాల కొండల్ రెడ్డి,నిరంజన్ రెడ్డి దేవునూరి పోచయ్య,బండారు రమేష్ గౌడ్ , బైతి స్వామి,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఊళ్లేంగల సాయి, చిక్కుడు ఉపలయ్య,చెరుకు మధుసూదన్ రెడ్డి, భర్రెoకల స్వామి,లింగాల కృష్ణ,మహేష్,వేంకట్,చిక్కుడు కర్ణాకర్ పాల్గొన్నారు
Telangana
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
Quick Summary:
తొగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి