నేటి సాక్షి ఆగస్టు 11పాములపాడు :-
పాములపాడు మండలంలో ప్రభావం వల్ల మొక్కజొన్న వేసిన పంట రైతులు అధిక పెట్టుబడి పెట్టి అప్పులపాలై పంట చేతికి రాక ఎండిపోయి పంటను పశువులకు దానగా చేయాల్సిన పరిస్థితి ఉందని తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి ప్రతి ఎకరాకు 60 వేలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు డిమాండ్ చేశారు.. మంగళవారం పాములపాడు మండలంలోని జూటూరు దగ్గర మొక్కజొన్న పంట నాశనం అయిన పరిస్థితిని రైతు తో వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెళ్లిన ప్రభావం వల్ల నందికొట్కూరు నియోజకవర్గం లో వేలాది ఎకరాల పంటలు రెండు దశకు చేరుకొని ఎండిపోయాయని ఏమి తోచని రైతులు మధ్యలోనే పంట వదిలేసి వెళ్తున్నారని దీనివల్ల రైతులు అధిక పెట్టుబడి పెట్టి ఎరువులు విత్తనాలు కవులు గుత్త తదితర ఖర్చులు బరాయిస్తున్నారని ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు అయిందని వారన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎకరాకు 60 వేలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వ్యవసాయ అధికారులు పంటలు పరిశీలించకుండా రైతుల పరిస్థితులను తెలుసుకోకుండా కార్యాలయాలకు పరిమితమయ్యారని వారన్నారు జిల్లా కలెక్టర్ గారు దృష్టి కేంద్రీకరించి నంద్యాల జిల్లా రైతాంగని ఆదుకోవాలని నంద్యాల జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతుల పక్షాన నిలవాలని ఆరు కోరారు లేని పక్షంలో ఆగస్టు 18 వ తేదీన చలో కలెక్టరేట్ కార్యాలయంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమం లో రైతు సబ్బురాయుడు తదితరులు పాల్గొన్నారు.
Andhra
పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి.కరువు మండలాలుగా ప్రకటించాలి..సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు*....
Quick Summary:
పాములపాడు మండలంలో ప్రభావం వల్ల మొక్కజొన్న