*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
గణేష్ నగర్‌లో శరత్ శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నూతన అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డితో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ మేడ్చల్ ఆర్బన్ జిల్లా నాయకులు నల్ల జై శంకర్ గౌడ్.
అదేవిధంగా రంగారెడ్డి నగర్‌లో బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ జనరల్ సెక్రటరీ నందనం దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక భక్తులు, మహిళలు, యువత, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ మన సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి పండుగలు ప్రజలందరిలో ఐక్యతను, భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తాయన్నారు.
ఈ కార్యక్రమాల్లో కట్ట కుమార్ , పులి బలరాం , తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.
ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానన్నారు.
Telangana
*గణేష్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఫలారం బండి ఊరేగగింపు*
Quick Summary:
గణేష్ నగర్‌లో శరత్ శ్రీకాంత్ ల