నేటి సాక్షి నారాయణపేట ఆగస్టు 12( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),
జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా
జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మరికల్ గ్రామీణ గ్రంథాలయంలో గ్రంథపాలకులు మల్లికార్జున్ ఆధ్వర్యంలో ప్రముఖ గ్రంథాలయ శాస్త్రవేత్త ఎస్.ఆర్. రంగనాథన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.
“పుస్తకం మనిషికి మంచి మిత్రుడు – గ్రంథాలయం జ్ఞానానికి నిలయం” అనే సందేశంతో పుస్తక పఠనం, గ్రంథాలయాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ పెద్దలు, యువకులు, పుస్తకాభిమానులు మరియు గ్రంథాలయ ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
జాతీయ గ్రంథాలయ దినోత్సవం
Quick Summary:
జాతీయ గ్రంథాలయ దినోత్సవం
